ఈటలపై బీజేపీ నాయకుల సంచలన వ్యాఖ్యలు
బీజేపీ | బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌పై ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మండల, గ్రామ కార్యకర్తలను

కరీంనగర్ : బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌పై ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మండల, గ్రామ కార్యకర్తలను పట్టించుకోకుండా.. కనీస మర్యాద ఇవ్వకుండా ఈటల రాజేందర్ ప్రవర్తిస్తున్నారని ఇల్లందకుంట బీజేపీ మండల అధ్యక్షులు నన్నబోయిన రవియాదవ్ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ తన అనుచరులతో మండలాల్లో పర్యటిస్తూ బీజేపీని నమ్ముకుని పని చేస్తున్న నాయకుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల బీజేపీలో చేరారని పేర్కొన్నారు.
ఈటల రాజేందర్ వల్ల అభివృద్ధి జరగదు. కుట్రపూరితమైన ఆలోచనలు చేయడంలో ఈటల దిట్ట అని రవి యాదవ్ పేర్కొన్నారు. ఈటల తీరుతో తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదని రవి యాదవ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రవి యాదవ్ పేర్కొన్నారు. రవి యాదవ్‌తో పాటు తోడేటి జితేందర్ గౌడ్, ఎల్లవేన అనిల్, తనుగుల తిరుపతి యాదవ్, గుత్తికొండ పవన్, గుత్తికొండ రాంబాబు, మాదాసు తిరుమలతో పాటు 200 మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

