CM KCR | సీఎం కేసీఆర్‌ను ఓడించడం కష్టం: బీజేపీ నేత మురళీధర్‌రావు
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
CM KCR | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను మాస్‌లీడర్‌గా అభివర్ణించారు. తాను ఇన్చార్జిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలిగింపును సమర్థించారు. బండి సంజయ్‌కి కలుపుగోలుతనం లేదని, ఇతర నేతలను దగ్గరికి రానివ్వలేదని, అందుకే పదవి నుంచి తొలిగించారంటూ వస్తున్న కథనాలకు మురళీధర్‌రావు బలం చేకూర్చినట్టయ్యింది. బీజేపీ ఎంపీ అర్వింద్ సైతం బండి సంజయ్ ఉన్నన్నాళ్లూ పార్టీలో గొడవలు ఉన్నాయని, ఇప్పుడు గ్రూపులు, గొడవలు లేవని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో బండి సంజయ్ అభిమానులు మురళీధర్‌రావు, అర్వింద్‌పై గుర్రుమంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

