హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలు తమ తప్పులు దాచిపెట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలను బయటపెడుతూ, పరిస్థితులను కళ్లకు కట్టేలా రాష్ట్రవ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక వ్యాసం రాశారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టిన ఈ వ్యాసం.. ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
‘తెలంగాణ ధాన్యాన్ని కొనడం జరగదని ఒకపక్క మోదీ ప్రభుత్వం తెగేసి చెప్తుంటే, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం ప్రజలు వరి పండించాలని రెచ్చగొడుతున్నారు. ఇంత చేస్తున్నారు కానీ, తెలంగాణ ధాన్యాన్ని కొంటామని కేంద్రం నుంచి రాతపూర్వక హామీ తీసుకురాలేరా? రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని బయటపెట్టారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
While Modi govt is outrightly refusing to buy rice produced in Telangana, BJP’s state-level leaders are provoking farmers to cultivate paddy. But they can’t even get a written commitment from Central govt? Timely piece by @SingireddyTRS exposing BJP betrayal of Telangana https://t.co/Lztng9hyWI
— Asaduddin Owaisi (@asadowaisi) November 21, 2021