రేపటి నుంచి బయో ఏషియా సదస్సు
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు
రెండు రోజుల్లో 50 మంది
ప్రముఖుల ఉపన్యాసాలు
మొదటి రోజు చర్చల్లో
మంత్రి కేటీఆర్, బిల్‌గేట్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు ప్రసంగించనున్నారు. సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడంపై తొలిరోజు జరిగే చర్చల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్‌గేట్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, యూరోపియన్ యూనియన్ ప్రధాన శాస్త్ర సలహాదారు (ఎపిడమిక్స్) డాక్టర్ పీటర్ పియోట్, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, బయాలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, కేంద్ర బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేశ్ ఎస్ గోఖలే తదితరులు పాల్గొంటారు.
ప్రపంచ లైఫ్‌సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్
ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సదస్సును నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.
27 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు: జయేశ్‌రంజన్
ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల నుంచి 27 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకొన్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ వెల్లడించారు. గురువారం నాటికి ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

