నలుగురైదుగురు కలసి పేపర్‌పై ఏదో రాస్తున్నట్టున్నారే.. పెన్ను కాస్త వెరైటీగా ఉంది.. అసలు అది రాస్తుందా..? లేదా అనే కదా మీ డౌటనుమానం. ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అది బాగానే రాస్తుంది. కాకపోతే చాలామంది కలసి కష్టపడితేనే ఈ పెన్నుతో రాయగలం మరి. భారీగా ఉన్న ఈ పెన్నును ఆచార్య మకునూరి శ్రీనివాస తయారుచేశారు.
ఇత్తడితో తయారు చేసిన ఈ పెన్ను 5.5 మీటర్ల పొడవు ఉంది. 37.2 కేజీల బరువు ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీనికి ముందు హైదరాబాద్‌లో తయారైన 1.45 మీటర్ల పొడవైన పెన్ను అతిపెద్దదిగా రికార్డుల్లో ఉండేది.