Smita Sabharwal | ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు.. స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు (Smita Sabharwal) హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ స్మితా సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
స్మితా సభర్వాల్ గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తనను సాక్షిగా పిలిచిందని, అయితే తనపై ఆరోపణలు చేసే ముందు చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిషన్ చట్టం-1952లోని 8బీ, 8సీ సెక్షన్ల ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న నిబంధనలను కమిషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఆ నిర్మాణ పురోగతిని సమీక్షించానని తెలిపారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హోదాలో మూడు బ్యారేజీల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించినట్టుగా కమిషన్ నివేదికలో ఉన్నదని పేర్కొన్నారు. మేడిగడ్డ, అ న్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో తన ప్రమేయం లేదని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులను విచారించే అవకాశం కూడా కల్పించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లోబడి ఉన్నదని తెలిపారు. క్యాబినెట్ ఎదుట ఫైళ్లు ఉంచలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్ పేరొనడం చెల్లదని తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. నివేదిక రద్దు చేయాలనని, తుది ఉత్తర్వులు వెలువరించే వరకు నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

