హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గించినట్టు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ఆర్డర్లు అన్ని పూర్తయ్యాయని, ఈ నేపథ్యంలో అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏడాది నుంచి నిర్విరామంగా కొవాగ్జిన్ ఉత్పత్తి చేశామని పేర్కొన్నది.