హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులో తెల్ల మగపులి బెంగాల్‌టైగర్ ‘అభిమన్యు’ మంగళవారం అనారోగ్యంతో మృ తి చెందింది. తొమ్మిది ఏండ్ల అభిమన్యు 2015 జనవరి 2న నెహ్రూ జులాజికల్ పార్కులో సైర్ (బద్రీ), డ్యామ్ (సురే ఖ/సమీరా)కు జన్మించింది. 2023 ఏప్రిల్ 21 నుంచి మూ త్రపిండాల సమస్యతో అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి జంతు ప్రదర్శనశాలలో పశువైద్య నిపుణులు దానికి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించి కన్ను మూసింది. జూపార్క్ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.