700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్
బీర్లు, శీతల పానీయాలు, పెర్ఫ్యూముల పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
- 500 మందికి ఉపాధి కల్పించనున్న బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : బీర్లు, శీతల పానీయాలు, పెర్ఫ్యూముల పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ‘బాల్’ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ ఆదివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడుల పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్‌కు సూచించారు. రాష్ట్రంలో ‘బాల్’ సంస్థకు అవరసరమైన భూమితోపాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రానికి టిన్నుల ద్వారా సరఫరా అవుతున్న బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో బీర్లను టిన్నుల్లో బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని చెప్పారు. 500 ఎంఎల్ బీర్ల టిన్నులతో ఎక్సైజ్ సుంకం తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటుకు కోకాకోలా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని, రూ.1000 కోట్లతో యూనిట్‌కు ‘బాల్’ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేస్తుందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

