ఎలుగుబంటి కలకలం రెండు రోజుల్లో ఇద్దరిపై దాడి
దారితప్పిన ఓ ఎలుగుబంటి రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
చండ్రుగొండ, జనవరి 30 : దారితప్పిన ఓ ఎలుగుబంటి రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మద్దుకూరులో వాకింగ్‌కు వెళ్లిన నల్లమోతు రామారావుపై దాడి చేసి 24 గంటలు గడవకముందే మంగళవారం చండ్రుగొండలోని అంబేద్కర్ కాలనీలో కంచర్ల తిరుపతి ఇంట్లోకి చొరబడింది. తిరుపతి ఇంటి ఆవరణ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా అతడి కాళ్లపై దాడి చేసింది.
బాధితుడు వెంటనే తేరుకొని అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పొలాల్లోకి పారిపోయింది. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఎలుగుబంటిని త్వరలోనే పట్టుకుంటామని, నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నామని ఎఫ్‌డీవో కోటేశ్వరరావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

