Balka Suman | తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది.. ఇంద్రకరణ్ రెడ్డిపై బాల్క సుమన్ ధ్వజం
Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బాల్క సుమన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బాల్క సుమన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ఇంతకన్న నీతిమాలిన, సిగ్గుమాలిన చర్య ఉండదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు. 75 ఏండ్ల వయసులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఆయన చేసేది ఏం ఉంటది..? ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నోళ్లకు మంత్రులుగా అవకాశం రాలేదు. కానీ ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించారు. కేసీఆర్ ఆయనను ఎంతో ఆదరించారు. ఇవాళ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది. ఆయనకు తగిన రీతిలో బుద్ది చెప్పాలి అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలి. ఐకే రెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆ పార్టీ మలినమైపోతోంది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడ్డ వారి హృదయాలు బాధపడుతున్నాయి. ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఐకే రెడ్డి నిర్ణయం తప్పుడు నిర్ణయం. ప్రజలే ఆయనకు సమాధానం చెబుతారని బాల్క సుమన్ తెలిపారు.
నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో మా పార్టీ నాయకులు ఉన్నారు. ఆ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో వెళ్తుందని సునీల్ కనుగోలు చెబుతున్నారు. ఈ ప్రభావం అన్ని సీట్లపై పడుతోంది. మల్కాజ్గిరిలో సునీతా మహేందర రెడ్డి, సికింద్రాబాద్లో దానం నాగేందర్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య.. ఈ నలుగురిని మా పార్టీ నుంచి తీసుకుని పోయారు. ఆ నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్కు వెళ్తూ- కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నట్లు నాలుగు రోజుల క్రితం సునీల్ కనుగోలు రిపోర్టు ఇచ్చారని బాల్క సుమన్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Nominated Posts | ‘నామినేటెడ్’ ఊరించుడే..! దీపావళి ఆశలపై నీళ్లు చల్లిన అధిష్ఠానం
Social Media | సామాజిక మాధ్యమాలకు చట్ట ‘రక్షణ’ తొలగింపు? భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని నిపుణుల ఆందోళన
Graduate Unemployment | డిగ్రీలున్నా దండగే..! దేశంలో యువ గ్రాడ్యుయేట్లలోసగానికిపైగా లో-స్కిల్స్ ఉద్యోగాల్లోనే
SDRF | వరదలో గల్లంతైన 11 మంది సేఫ్.. బేతుపల్లి చెరువు వద్ద తెల్లవారు జామున లభించిన ఆచూకీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

