Balapur Ganesh | బాలాపూర్ గణేశుని లడ్డూ వేలానికి రంగం సిద్ధం
హైదరాబాద్: బాలాపూర్ గణేశుని లడ్డూ వేలం (Balapur Ganesh Laddu Auction) మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.
హైదరాబాద్: బాలాపూర్ గణేశుని లడ్డూ వేలం (Balapur Ganesh Laddu Auction) మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. గణేశుడిని భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ బాలాపూర్ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తున్నారు. అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట కొనసాగుతున్నది. గత 27 ఏండ్లుగా ఉత్సవ సమితి లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలం జరగలేదు. మొదటిసారిగా లడ్డూ వేలం రూ.450తో ప్రారంభమైంది. 2010 నాటికి రూ.10.32 లక్షలకు చేరింది. 2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16.6 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు, 2019లో కొలన్ రాం రెడ్డి రూ.17.6 లక్షలకు, 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.90 లక్షలకు, 2022లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు గణేశుని లడ్డూ సొంతం చేసుకున్నారు. కాగా, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు దక్కింది.
లడ్డూ వేలం-విజేతలు
1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
2001 జీ రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
2009లో సరిత- రూ.5,10,000
2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
2017లో రూ.15 లక్షలు
2018లో శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18 లక్షల 90 వేలు
2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

