హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకుడిగా బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంచాలకుల పదవి మూడు నెలలుగా ఖాళీగా ఉండగా, దానిని భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్టు సైనిక సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. నూతన సంచాలకుడిగా ఎస్ఆర్ బాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తదుపరి చైర్మన్గా పద్మ డోర్జె నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ బీపీ పాండే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.