e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home తెలంగాణ సంస్కరణలు తెస్తా

సంస్కరణలు తెస్తా

సంస్కరణలు తెస్తా
  • కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొంటాం..
  • మెరిట్‌ ఆధారంగా పోస్టులు భర్తీచేస్తాం
  • ప్రణాళికతో, పారదర్శకంగా పనిచేస్తాం
  • చైర్మన్‌గా నియామకం ఆశ్చర్యపరిచింది
  • ‘నమస్తే తెలంగాణ’తో బీ జనార్దన్‌రెడ్డి

నాడు ఉద్యోగం కోసం ఏ ఆఫీసు మెట్లెక్కారో, అదే ఆఫీస్‌కు ఇప్పుడు బాస్‌ కాబోతున్నారు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి. ఒకప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగిగా ఎంపికైన ఆయన ఇప్పుడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో అదే కార్యాలయంలో అడుగుపెట్టబోతున్నారు. వినూత్న విధానాలు, సరికొత్త ఆలోచనలతో సంస్కరణలకర్తగా పేరొందిన జనార్దన్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ఆయన్ను పలుకరించింది. ఈ సందర్భంగా అత్యంత నమ్మకంతో, ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఊహించలేదు.. సర్‌ప్రైజ్‌

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తారని ఊ హించలేదు. ఏ శాఖనిచ్చినా సమర్ధంగా పనిచేయాలనుకున్నానే తప్ప ఇంత ముఖ్యమైన పోస్టులో నియమిస్తారని అనుకోలేదు. ఐఏఎస్‌గా పనిచేస్తున్న నాకు భిన్నంగా ఈ బాధ్యత అప్పగించటం ఆశ్చర్యానికి గురిచేసింది.

మెరిట్‌కే నా ప్రాధాన్యం

అధికారులు పనిచేస్తేనే ప్రభుత్వం పనిచేసినట్టు. మెరిట్‌ ఉన్నవాళ్లను ఎంపికచేస్తేనే సక్రమంగా సేవలందిస్తారు. యుక్త వయసు, సృజనాత్మక గలవారు చురుకుగా పనిచేస్తారు. ఉద్యోగాల భర్తీలో వందశాతం మెరిట్‌నే అనుసరిస్తాం. ఆ దిశగానే కార్యాచరణ ఉంటుంది.

నమ్మకం కలిగేలా పనిచేస్తాం

ప్రభుత్వ ఉద్యోగాలంటేనే వెయ్యి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తే 10 లక్షల మంది పోటీపడతారు. వారిలో మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం చేయడం మా ప్రథమ కర్తవ్యం. మిగతావాళ్లు తమకు అన్యాయం జరిగిందని అనుకోరాదు. టీఎస్‌ఎసీఎస్సీ అంటే నమ్మకం ఉండేలా, నియామకాలు సక్రమంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం.

సకాలంలో ఉద్యోగాలు మా బాధ్యత

టీఎస్‌పీఎస్సీ అంటేనే విద్యార్థులతో ముడిపడి ఉన్న అంశం. ఎన్నో ఆశలతో ఉన్నవారికి సకాలంలో ఉద్యోగాల కల్పన మా మొదటి బాధ్యత. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం సమాయానికి నోటిఫికేషన్లు జారీచేయడం, అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించటం, సకాలంలో ఫలితాలు ప్రకటించటం మా కర్తవ్యం. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, అత్యంత పారదర్శకంగా, నిజాయితీతో ఉద్యోగాల భర్తీ చేపడుతాం.

సంస్కరణలకు పెద్దపీట

ప్రపంచంలో పెద్ద గది ఏదైనా ఉదంటే అది సంస్కరణల గది అన్నది నా అభిప్రాయం. ఈ నిమిషానికి మంచిది అనిపించింది మరో నిమిషానికి కొత్తదాని రాకతో మారిపోతుంది. నిత్యం కొత్త విధానాలను నేర్చుకుంటూ సంస్కరణల అమలుకు ప్రయత్నిస్తాం. కొత్త టెక్నాలజీ కనిపించినా, ఉత్తమ విధానాలున్నా ఆకళింపు చేసుకొని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. టీఎస్‌పీఎస్సీని దేశానికి దిక్సూచిగా మార్చేందుకు కృషిచేస్తాం.
బయోడాటా
పేరు: డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి
పుట్టిన తేదీ, స్వస్థలం:
06-11-1962,
మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దాయపల్లి
విద్యార్హత: బీవీఎస్సీ, ఎంవీఎస్సీ (వ్యవసాయ వర్సిటీ)
ఉద్యోగ నియామకం:
1990లో డిప్యూటీ కలెక్టర్‌
నిర్వహించిన బాధ్యతలు:
నల్లగొండ, నెల్లూరు ఆర్డీవో,
కరీంనగర్‌జిల్లా హౌజింగ్‌ మేనేజర్‌,
అదే జిల్లాలో డీఆర్‌డీఏ పీడీ
2001 -04 కృష్ణా, గుంటూరు,
చిత్తూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌
2004 -07 వరకు మెప్మాలో సేవలు
2008 -09 వరంగల్‌ జిల్లా కలెక్టర్‌
2009 -11 అనంతపురం జిల్లా కలెక్టర్‌
2011- 15 మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌
2014 -15 వ్యవసాయశాఖ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, మార్కెటింగ్‌శాఖల కమిషనర్‌, జలమండలి ఎండీ, సహకారశాఖ రిజిస్ట్రార్‌
2015 -18 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
2018 -19 హెచ్‌ఎండీఏ కమిషనర్‌
2019 -20 విద్యాశాఖ కార్యదర్శి
2020- 21 వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌
సెక్రటరీ, కాకతీయ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంస్కరణలు తెస్తా

ట్రెండింగ్‌

Advertisement