హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉమెన్ సేఫ్టీ వింగ్‌పై ఆ విభాగం ఏడీజీ శిఖా గోయల్ రాష్ర్టానికి వచ్చిన ట్రైనీ ఐపీఎస్‌లకు శుక్రవారం అవగాహన కల్పించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని భరోసా, షీటీమ్స్, సాహస్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి విభాగాలు, వాటి పనితీరుపై ఆమె ట్రైనీలకు వివరించారు. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇతర రాష్ర్టాలకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచిందో చెప్పారు. ఇప్పటివరకు నమోదైన కేసులు, సున్నితమైన కేసులను ఛేదించిన విధానం, సంచలనం సృష్టించిన లైంగికదాడుల కేసులను డీల్ చేసిన విధానం గురించి విపులంగా వివరించారు.