కామాంధులతో ఆటోడ్రైవర్ పోరాటం
స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం పొందారు. అడ్డుకునే ప్రయత్నించిన బాలిక స్నేహితుడు, ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. వారిని ఆటో నుంచి బలవంతంగా దింపేసినా మళ్లీ ఆటో ఎక్కి మరీ వేధింపులకు పాల్పడ్డారు.
- బాలికను లాక్కెళ్లేందుకు దుండగుల ప్రయత్నం
- అడ్డుకున్న బాలిక స్నేహితుడు, ఆటోడ్రైవర్
- దాడిచేసి గాయపరిచినా వెనక్కి తగ్గని డ్రైవర్
- బాలికను కాపాడి ఇంటి వద్ద దించిన వైనం
- ఇంట్లోకి సైతం జొరబడి లాక్కెళ్లే ప్రయత్నం
- డయల్ 100కు ఫోన్ చేసిన పొరుగింటి వ్యక్తి
- నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అందరూ చూస్తుండగా బోరబండలో దారుణం
వెంగళరావునగర్, డిసెంబర్ 24 : స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం పొందారు. అడ్డుకునే ప్రయత్నించిన బాలిక స్నేహితుడు, ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. వారిని ఆటో నుంచి బలవంతంగా దింపేసినా మళ్లీ ఆటో ఎక్కి మరీ వేధింపులకు పాల్పడ్డారు. బోరబండలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్‌లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నది. సోమవారం సాయంత్రం జీతం కోసం మాదాపూర్ వెళ్లింది. ఈ క్రమంలో అదే హోటల్లో కుక్‌గా పనిచేసే బీహార్‌కు చెందిన యువకుడి (18)తో కలిసి రాత్రి 10.40 గంటల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. సంత ప్రాంతం వద్ద ఐదుగురు యువకులు ఆటోను అడ్డగించారు. వారిలోంచి ఇద్దరు ఆటో ఎక్కగా, వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకడు డ్రైవర్ పక్కన కూర్చోగా, మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్‌పై వచ్చారు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితోపాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలోకి చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ ఆగని నిందితులు ఇంట్లోకి జొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

