భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వినయ్ భాస్కర్

వరంగల్ : భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు. ఆదివారం వరంగల్ టౌన్‌లోని ఏషియన్ మాల్ వెనుక గల అంబేద్కర్ నగర్ లోని లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతపు ప్రజల సౌకర్యార్థం సాయిబాబా గుడి సమీపంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. నాలలను పరిశీలించి వరద నీరు వెళ్లేలా చెత్తా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయం అందించుటకు బల్దియా ఆధ్యర్యంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ 1800 425 1980 టోల్ ఫ్రీ, 97019 99645 మొబైల్, 79971 00300 వాట్సప్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 12 జేసీబీలు, 4 డోజర్ బండ్లను అందుబాటులో ఉంచుతూ అవసరమైన చోట యంత్రాలను వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ధన, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అదికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

