ఏసీబీకి చిక్కిన జిల్లా కార్మికశాఖ అధికారి
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం కార్మికశాఖ సహాయ అధికారి సాయిబాబా రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తండ్రీకొడుకులు
నిర్మల్ టౌన్, డిసెంబర్ 18: నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం కార్మికశాఖ సహాయ అధికారి సాయిబాబా రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దబెల్లాల్‌కు చెందిన గంగన్న తల్లి మూ డు నెలల క్రితం మృతి చెందింది. ఆమె కార్మిక శాఖలో పనిచేస్తుండటంతో.. కార్మికశాఖ నుంచి ఆమెకు రూ.1.30 లక్షల బీమా మంజూరు చేయాలని గంగన్న అధికారిని సంప్రదించాడు.
ఫైలుపై సంతకం చేయాలంటే 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.25 వేలు ఇస్తానని ఒప్పుకున్న గంగన్న.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. వారి సూచనల మేరకు సోమవారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణం ప్రియదర్శినినగర్‌లోని సాయిబాబా ఇంటికి గంగన్న డబ్బులు తీసుకొని వెళ్లాడు. ఇంట్లో ఉన్న అధికారి తన కుమారుడు దామోదర్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. దమోదర్కు డబ్బులు ఇస్తుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

