MLAs Defection | వివరణ ఇవ్వండి.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు (MLAs Defection) తాఖీదులు అందాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా శాసన కార్యదర్శి నరసింహా చార్యులు మంగళవారం నోటీసులు పంపించారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు (MLAs Defection) తాఖీదులు అందాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా శాసనసభ కార్యదర్శి నరసింహా చార్యులు మంగళవారం నోటీసులు పంపించారు. అయితే వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోరారు.
2024 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులను బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు. ఇటీవలే బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది. నిర్ధిష్ట సమయం చెప్పాలంటూ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నరసింహా చార్యులు నోటీసులు ఇచ్చారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను, తాజాగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. ఈ పిటిషన్లను తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

