హైదరాబాద్, ఆట ప్రతినిధి, అక్టోబర్ 20: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో అర్శనపల్లి జగన్మోహన్రావు(63) జయకేతనం ఎగురవేశారు. ఉత్కంఠభరిత ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సమీప అభ్యర్థి అమర్నాథ్(62)పై విజయం సాధించారు. నువ్వానేనా అన్నట్లు కొనసాగిన అధ్యక్ష పోరులో ఆఖరికి జగన్నే విజయం వరించింది.
శుక్రవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ పాలకవర్గానికి ఎన్నికలు జరిగాయి. జాతీయ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోల్ అయ్యాయి.