Warangal Crime | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Warangal Crime | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లు లో నిర్బంధించారు.
వరంగల్ క్రైం జూలై 06 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లు లో నిర్బంధించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల లో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను స్థానిక పోలీసులు తెల్లవారుజాము నుంచి ఇళ్లను నుంచి పట్టుకొచ్చి స్టేషన్లలో నిర్బంధించారు.
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ అరెస్టులు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

