హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్ల డీఏ బకాయిలను ఒకే దఫాలో చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసొసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ఉపాధ్యక్షుడు బీ శంకర్ బుధవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అ వార్డుల దరఖాస్తుల గడువు ఈ నెల 13తో ముగుస్తుందని విద్యాశాఖ ప్రకటించింది. అర్హులైన వారు గడువులోగా నామినేషన్లు సమర్పించాలని వెల్లడించింది.