పెద్ద స్క్రీన్, బలమైన బ్యాటరీ, స్టయిలస్ సపోర్ట్, ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఉండే ట్యాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? బడ్జెట్లోనే అత్యాధునిక ఫీచర్లు కావాలని ఆశపడుతున్నారా? అయితే.. ‘ఒప్పో ప్యాడ్5’పై ఓ లుక్కేయండి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. మరో సరికొత్త ఉత్పత్తితో రాబోతున్నది. ‘ఒప్పో ప్యాడ్ 5’ పేరుతో టాబ్లెట్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయబోతున్నది. తాజాగా, ఈ నయా ప్యాడ్ ప్రత్యేకతలతో ఓ టీజర్‌ను వదిలింది. ఈ ట్యాబ్‌లో 12.1 అంగుళాల 2.8కె రిజల్యూషన్ డిస్ప్లేను ఏర్పాటుచేసింది.
ఈ పెద్ద స్క్రీన్ అత్యద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్సెట్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ట్యాబ్.. మిడ్ప్రీమియం విభాగంలో అత్యంత శక్తిమంతమైన టాబ్లెట్లలో ఒకటిగా నిలవబోతున్నది. ఈ ట్యాబ్‌తో మల్టీ టాస్కింగ్ పనులన్నీ సజావుగా సాగుతాయి. యాప్‌లు వేగంగా లోడ్ అవుతాయి. 10,050 ఎంఏహెచ్ బ్యాటరీ రోజంతా నడుస్తుంది. 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల.. కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌చార్జ్ అయిపోతుంది. వీడియో కాలింగ్, మీటింగ్స్ కోసం.. ముందు, వెనక భాగాల్లో 8 ఎంపీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కలర్ ఓఎస్ 16పై ఈ ట్యాబ్ పనిచేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్, ఆపిల్ ఐపాడ్ లాంటి ప్రీమియం ట్యాబ్‌లకు.. ‘ఒప్పో ప్యాడ్ 5’ గట్టి పోటీ ఇవ్వనున్నదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.