వర్ధన్నపేట, ఫిబ్రవరి 2 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నాగరాజు సోమవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రచారం నిర్వహించగా అందులో ఏఆర్ కానిస్టేబుల్ పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే నాగరాజు, అధికార పార్టీకి చెందిన నాయకులు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.