వెంకటాపూర్, జూలై 28: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో కాకతీయ హెరిటేజ్ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో నిర్వహించనున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్‌కు యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర పురావస్తుశాఖ, తెలంగాణ టూరిజం, ఇంటాక్, ఐకోమస్ ఇండియా సహకారంతో వలంటీర్ క్యాంపెయిన్నను ‘వర్కింగ్ ఆన్ ద ప్యూచర్’ అనే థీమ్‌తో నిర్వహించనున్నారు.
చరిత్ర, కళలు, అర్కియాలజీ, అర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, జియాలజీ బ్యాక్‌గ్రౌండ్‌తో డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏండ్లలోపు వారు అర్హులు. www. kakatiyaheritagetrust.orgలో కానీ, https;// whc.unesco. org/en/volunteers 2024 యునెస్కో వెబ్సైట్లో కానీ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 15 కాగా, ఆగస్టు 20న 40 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో విదేశీయులు 10, స్వదేశం నుంచి 30 మందిని ఎంపిక చేస్తారు. వివరాలకు పాండురంగారావు నంబర్ 9989537268, ట్రస్టు సభ్యుడు శ్రీధర్‌రావు నంబర్ 9441280606ను సంప్రదించవచ్చు.