హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 4 నుంచి 16 వరకు 43,500 దరఖాస్తులు రాగా, బుధవారం ఒక్కరోజే 8,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది.