హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో మార్చి 9 నుంచి 20 వరకు జరుగనున్న ‘కమిషన్ ఆఫ్ స్టేటస్ ఉమెన్’లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మానవ హక్కులు, అంతర్జాతీయ సంబంధాలు, మహిళా సాధికారత, వ్యాపార భాగస్వామ్యం రంగాల్లో కృషి చేస్తున్న స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సొంత ఖర్చులు భరించి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు iccdr@gmail.com లేదా 9440718464 నంబర్లో సంప్రదించాలని సూచించారు.