శామీర్పేట, నవంబర్ 4: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2024 దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కృష్ణదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం తరఫున ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 3 వరకు ఉండగా దానిని పొడిగించినట్టు తెలిపారు. ఇతర వివరాల కోసం ఈమెయిల్లో CLAT@CONSORTIUMOFNLUS.AC.IN ఫోన్ నెంబర్ 080 47162020 సంప్రదించాలని పేర్కొన్నారు.