తెలంగాణలో అభివృద్ధిపై ఏపీ మంత్రి ఆసక్తికర కామెంట్స్.. ఉమ్మడి పాలనకన్నా..
తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున కొనియాడారు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని కితాబిచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇతర దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన పీవీ మార్గ్‌లోని 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని సోమవారం సందర్శించారు.
- తెలంగాణ అభివృద్ధిలో స్పష్టమైన తేడా
- అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన
- ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున కొనియాడారు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని కితాబిచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇతర దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన పీవీ మార్గ్‌లోని 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంబేదర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేదర్ విగ్రహ ఆవరణలోని మ్యూజియం, థియేటర్లను పరిశీలించారు. అంబేదర్ విగ్రహ చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనకు నిదర్శనమని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌గా తాను ఉమ్మడి రాష్ట్రంలో పని చేశానని, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని పేర్కొన్నారు. అంబేదర్ విగ్రహం ఏర్పాటుతో ఇకడ చాలా అభివృద్ధి జరిగిందని, విగ్రహం ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
లింబాద్రికి అభినందనలు
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున అభినందించారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వచ్చిన మంత్రి.. లింబాద్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

