హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ సర్కారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీని కూడా తప్పుదారి పట్టించింది. బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈఏసీ సమావేశంలో ఏపీ అధికారులు.. ఎకోజోన్కు 18 కిలోమీటర్ల దూరంలో సీమ లిఫ్ట్ ఉన్నట్టు తెలిపారు. వాస్తవానికి సీమ లిఫ్ట్ ఎకోజోన్ పరిధి లోపల ఉన్నదని చిత్రాలు, మ్యాపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఆధారాలతో లేఖ కూడా రాసింది.