హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): ఏపీ ఫైబర్ నెట్ సాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ-25 నిందితుడిగా ఏపీ సీఐడీ చేర్చింది. రూ.330 కోట్ల వర్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించడానికి టెండర్ ప్రక్రియను తారుమారు చేసినట్టుగా పేర్కొన్నది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీ వారెంట్ వేశారు