హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. htths;//tirupatibalaji.ap.gov.in/ పేరుతో అధికారిక వెబ్సైట్ ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు htths;//tirupatibalaji-ap-gov.in/ పేరిట నకిలీ వెబ్సైట్ను రూపొందించారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నకిలీ వెబ్సైట్ను నమ్మొద్దని భక్తులను కోరింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, అధికారిక యాప్ను వినియోగించవచ్చని పేర్కొన్నది. ఇప్పటివరకు టీటీడీ పేరిట ఉన్న 41 నకిలీ వెబ్సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ వెల్లడించింది.