హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎం ఫార్మసీ, ఫార్మా(పీబీ) కోర్సుల్లో మరో 1,305 సీట్లు భర్తీ అయ్యాయి. పీజీఈసెట్ తుది విడత సీట్లను బుధవారం కేటాయించారు. 1,516 సీట్లుంటే 2,596 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 1,305 మంది సీట్లు దక్కించుకున్నట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారు ఈ నెల 15లోగా రిపోర్ట్చేయాలని సూచించారు.
పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్టు విడుదల
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటా కింద 2025-26 విద్యాసంవత్సరానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ వర్సిటీ బుధవారం విడుదల చేసింది. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే knrpgadmissions @gmail.comకు శుక్రవారం
సాయంత్రం 5 గంటల్లోగా మెయిల్ పంపాలని కోరింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని సూచించింది.