వాషింగ్టన్: హాలీవుడ్ సినిమా ‘సూపర్‌మ్యాన్’లో అతీత శక్తులు పొందిన హీరో రాకెట్ వేగంతో గగనవీధుల్లో దూసుకుపోవడాన్ని ఎంతో ఇష్టపడ్డాం. ఇప్పుడు సాధారణ మనుషులు కూడా వినువీధుల్లో సూపర్మ్యాన్లా విహరించేందుకు అమెరికాకు చెందిన జెవా కంపెనీ ఓ ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. చిన్నసైజు ఎస్టీడీ బూత్‌లా ఉండే ఈ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏకకాలంలో ఒక మనిషి నిల్చొని ప్రయాణించవచ్చు. గంటలకు 160 మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయోగ పరీక్షలు ఇటీవల విజయవంతమైనట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలో ఎనిమిది జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ మోటర్లు, ప్రత్యేక సాంకేతికతను వినియోగించడంతో కాలుష్య ఉద్గారాల భయం ఉండబోదని తెలిపింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కావాలంటే రూ. 1.86 కోట్లు ఖర్చు చేయాల్సిందే.