వనపర్తి (నమస్తేతెలంగాణ)/అమరచింత, నవంబర్ 26 : ‘ 20 నెలలుగా ఇంటి కిరాయి డబ్బులు అడిగివేసారాను.. చివరకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను’ అని యజమాని హల్చల్ చేసిన ఘటన మంగళవారం వనపర్తి జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండల పరిషత్ కార్యాలయాన్ని మహంకాళి సురేందర్ ఇంట్లో కిరాయికి తీసుకొని నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం నెలకు రూ. 14,600 అద్దె చెల్లించేందుకు అగ్రిమెంట్ రా సుకున్నారు. 20 నెలలుగా కిరాయి ఇవ్వడంలేదు. మూడు నెలల క్రితం 10 నెలల కిరాయి కి సంబంధించి రూ.లక్షా 45వేల చెక్కు ఇచ్చా రు. దీనిని ఆత్మకూరు ఎస్టీవోలో ఇవ్వగా, వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఆన్లైన్లో చూయిస్తున్నది. దీంతో కిరాయి ఇవ్వకుంటే ఆత్మహత్యకు చేసుకుంటానని మంగళవారం పెట్రోల్ బాటిల్తో వచ్చి, కా ర్యాలయానికి తాళం వేశాడు. విషయం తెలు సుకున్న ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని పెండింగ్ కిరాయి చెల్లిస్తానని భరోసా ఇవ్వడం తో సురేందర్ కార్యాలయ తాళాన్ని తీశాడు.