కరీంనగర్ కార్పొరేషన్, జూన్: జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం వెలువడిన ఈ ఫలితాల్లో ప్రతిభ చూపిన ఆల్ఫోర్స్ విద్యార్థులను కరీంనగర్‌లోని వావిలాలపల్లి కళాశాల ఆవరణలో అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ విద్యార్థులు అజ్మీరా పురుషోత్తం నాయక్ 166వ ర్యాంకు, పీఎన్ సాయిధృవ 557, ఎన్ అనిరుధ్‌సాయి 657, బీ ఆదిత్య 945, బీ విష్ణు 1,203, ఎం అక్షిత 1,224, వీ హృషికేశ్ 1,329, ఆర్ గోవర్ధన్ 1,506, జే వామిక 1,604, బీ చైశ్రవ్రాజు 1,640, ఈ శశిలాల్ 1,899, కే వీరేంద్రప్రసాద్ 2,120, డీ కార్తీక్‌రెడ్డి 2,150, ఎస్ విఘ్నేశ్ 2,293, డీ అభిరామ్ 2,349, ఏ శశిప్రీతమ్ 2,463, ఈ అంకిత్‌సాయి 2,613, మహ్మద్ అబ్దుల్‌హక్ 2,766, డీ విశాల్ 2,917 ర్యాంకులు సాధించారని వివరించారు. నలుగురు 1,000లోపు ర్యాంకులను, సాధించినట్టు తెలిపారు.