Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి వేడుకలు.. నారాయణుడి నామఃస్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత నరసింహుడు మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చారు.
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత నరసింహుడు మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కుటుంబసభ్యులతో నరసింహస్వామిని దర్శించుకున్నారు. భద్రాచలంలోనూ అధ్యయనోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచే స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. సంగారెడ్డి వైకుంఠపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవలో మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా గరుడవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






