హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్సీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ కమోడోర్ వీఎం రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన వీఎం రెడ్డి విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, వైజాగ్‌లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1989లో భారత వైమానిక దళంలోని ఫైటర్స్ట్రీమ్లో నియామకం పొందారు. వీఎం రెడ్డి భారత వైమానిక దళానికి విశేష సేవలందించారు.
పైలట్ అటాక్ ఇన్స్ట్రక్టర్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లో 2 వేల గంటలకుపైగా ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ స్వాడ్రన్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ రేంజ్, ఫ్రంట్ లైన్ ఫైటర్ బేస్‌కు నాయకత్వం వహించారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ పదవి చేపట్టడానికి ముందు హెచ్‌క్యూ సదరన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్-ఎల్గా విధులు నిర్వర్తించారు.