Sampath Kumar | మాదిగలకు కాంగ్రెస్‌లో అన్యాయం.. : మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస్తవాలను దాచిపెట్టి తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
- నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా నేనే అర్హుడిని
- మల్లు రవికి ఇప్పటికే క్యాబినెట్ హోదా
- ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు
- తక్షణమే మీరు జోక్యం చేసుకోండి
- సోనియాగాంధీకి సంపత్‌కుమార్ లేఖ
Sampath Kumar | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస్తవాలను దాచిపెట్టి తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మాదిగ ఉపకులానికి చెందిన తానే నాగర్‌కర్నూల్ స్థానానికి అన్ని అంశాల్లో అర్హత కలిగిన, గెలవగల అభ్యర్థినని వివరించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17,30,781 మంది కాగా అందులో మాదిగ ఓటర్లు 3,75,532, మాల ఓటర్లు 62,801 మంది ఉన్నారని వివరించారు.
ఖమ్మం నాయకులు, ఏఐసీసీ నాయకులు కలిసి వాస్తవాలను అణచిపెట్టి, అదే నియోజకవర్గంలో నాలుగుసార్లు ఓడిపోయిన, మాల కులానికి చెందిన మల్లు రవి పేరును ఖరారు చేశారని, హార్డ్‌కోర్ కార్యకర్తనైన తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మల్లు రవికి ఇదివరకే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదా కల్పించారని గుర్తుచేశారు. తాను ఇన్చార్జి సెక్రటరీగా మహారాష్ట్ర స్రీనింగ్ కమిటీ సమావేశాల్లో బిజీగా ఉన్న సమయంలో మల్లు రవి పేరును సీఈసీకి ప్రతిపాదించారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

