హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): పలుకుబడి ఉన్న తండ్రి, బలాత్కారాలు చేసే రాజకీయ పార్టీ చాటున నేరస్తుడు దాక్కోవడం సిగ్గుచేటు అని నటుడు ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై నమోదైన పోక్సో కేసును ఉద్దేశించి ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నేరస్తుడిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీని కోరారు. బీజేపీ వాషింగ్ మిషన్ సిద్ధమయ్యాక నిందితుడు బయటకొస్తాడేమో అని మరో ట్వీట్లో సందేహం వ్యక్తం చేశారు.