హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణ): బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా డిమాండ్ చేసింది. డీజీపీ జితేందర్‌ను శుక్రవారం మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్ శిల్పారెడ్డి కలిసి ఫిర్యాదు అందజేశారు. దానంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
మరో బడికి మిగులు టీచర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సర్కారు టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలిచ్చింది. జీవో-25లోని రేషనలైజేషన్ గైడ్‌లైన్స్‌ను అనుసరించి వర్క్ అడ్జస్ట్కు కలెక్టర్లకు అధికారాలు అప్పగించింది. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోగా, మరికొన్ని స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో విద్యార్థులున్న చోట టీచర్లు లేకపోగా, టీచర్లున్న చోట విద్యార్థులు లేని పరిస్థితి నెలకొన్నది. దీంతో 23లో వర్క్ అడ్జస్ట్(అంతర్గత సర్దుబాటు) పూర్తిచేయాలని విద్యాశాఖ గడువు విధించింది.