ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 17 : ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కేపీవీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగల్‌పల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థిని స్థానిక ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నది.
ఈ వసతిగృహ భవనంలోని కింది భాగంలో రియల్ఎస్టేట్ వ్యాపారి వద్ద నల్గొండజిల్లా అక్కనబోయిన ప్రాంతానికి చెందిన అజిత్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం సేవించిన అజిత్ హాస్టల్ రూంలో ఉన్న విద్యార్థినిపై లైంగికదాడి చేశాడు. డయల్ 100 డయల్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని శుక్రవారం మంగల్‌పల్లిలో పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు.