అక్రమాస్తుల ‘ప్లానింగ్’ అధికారిణి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ తేల్చింది. సోమవారం ఆమె నివాసం, కార్యాలయంతోపాటు బంధువులు, సన్నిహితులు, బినామీలవి కలిపి 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసి రూ.6.76 కోట్ల స్థిర, చరాస్తులను గుర్తించారు.
- రూ.6.76 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ
- మార్కెట్ విలువ 50కోట్ల పైమాటే
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ తేల్చింది. సోమవారం ఆమె నివాసం, కార్యాలయంతోపాటు బంధువులు, సన్నిహితులు, బినామీలవి కలిపి 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసి రూ.6.76 కోట్ల స్థిర, చరాస్తులను గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, కోయిల్‌కొండ మండలంలో ఎక రం 10 గుంటల వ్యవసాయ భూమి, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల ప్లాట్, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ఫ్లాట్, జీ+2 బి ల్డింగ్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.4.25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో రూ.50 లక్షలు, షేర్లలో రూ.1.30 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు తే ల్చిన అధికారులు.. ఆమె బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షలకుపైగా ఉన్నట్టు గుర్తించారు. ఆమె వద్ద రూ.5.47 లక్షల నగదు, సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, మ హీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ క్రె టా కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్న ట్టు గుర్తించారు. ఈ అక్రమ ఆస్తుల విలువ బ హిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లంచం తీసుకున్న కేసులో సెప్టెంబర్ 30న వాణిని ఇప్పటికే అరెస్టు చేశారు.
చరాస్తులు..
నగదురూ.5,47,500, తుల్జా భవానీ వైన్స్‌లో పెట్టుబడి రూ.50,00,000, షేర్లలో పెట్టుబడులు రూ.1,30,00,000,బ్యాంకు ఖాతాల్లో నిల్వలు రూ.7,97,238, బంగారు ఆభరణాలురూ.2,54,000, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు రూ.50,00,000, గృహోపకరణాలురూ.5,10,000
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

