Home
Telangana
Telangana Sarpanches Jac Seeks Regular Funds And Protection Of Village Panchayat Powers
సర్పంచుల అధికారాలను కాపాడాలి
గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ), కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ కోరింది. గ్రామ సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన సర్వహకులు, అధికారాలను కాపాడాలని విజ్ఞప్తిచేసింది.
- సర్పంచుల సంఘం జేఏసీ వినతి
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ), కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ కోరింది. గ్రామ సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన సర్వహకులు, అధికారాలను కాపాడాలని విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌కు సర్పంచుల జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా, ప్రతి గ్రామంలో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

