మెప్మా అధికారి నివాసాల్లో ఏసీబీ సోదాలు
మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.
- వెలుగులోకి 40 కోట్ల అక్రమాస్తులు
- 10 చోట్ల ఏకకాలంలో సోదాలు
- ఉప్పల్‌లో జీ+3 భవనం, పెంట్ హౌస్, 12 ఓపెన్ ప్లాట్లు 1.79 కిలోల బంగారం, 3 కిలోల వెండి స్వాధీనం
- బ్యాంకు ఖాతాల్లో 32.30 లక్షలు
హైదరాబాద్ , నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. మంగళవారం హైదరాబాద్, సూర్యాపేట సహా పది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు గుర్తించారు. ఆయన ఆస్తుల వి లువ అధికారిక లెకల ప్రకారం రూ.4,7 5,61,171గా అంచనా వేశారు.
12 ప్లాట్లు.. ఉప్పల్‌లో భారీ భవనం
యాదగిరిరావుకు హైదరాబాద్‌తోపాటు సూర్యాపేటలో మొత్తం 12 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.58.63 లక్షలుగా అంచనా వేశారు. ఉప్పల్‌లో రెండు ఫ్లాట్లు ఉండగా వాటి విలువ రూ.31.36 లక్షలుగా నిర్ధారించారు. అదే ప్రాంతంలో జీ+3 అంతస్తులతోపాటు పెంట్‌హౌస్ కలిగిన భారీ నివాస భవనాన్ని గుర్తించారు. దీని విలువ రూ.2 కోట్లుగా లెకగట్టారు. సూర్యాపేట జిల్లాలో ఆర్సీసీ పైకప్పుతో నిర్మించిన మరో ఇంటిని గుర్తించగా, దాని విలువ రూ.4.75 లక్షలుగా పేరొన్నారు. ఉప్పల్‌లో ఒక వాణి జ్య దుకాణం కూడా ఉన్నట్టు గుర్తించారు. 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండగా, వాటి విలువ రూ.33.82 లక్షలుగా అంచనా వేశారు.
మరో మూడు కిలోల వెండి ఆభరణాలు గుర్తించగా వాటి విలువ 1.80 లక్షలుగా లెకగట్టారు. టయోటా ఫార్చ్యూనర్తోపాటు మరో కారు ఉన్నట్టు గుర్తించారు. ఈ వాహనాల విలువ రూ.73 లక్షలుగా పేరొన్నారు. మూడు ద్విచక్ర వాహనాల విలువ రూ.2.80 లక్షలుగా అంచనా వేశారు. ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి విలువ రూ.29.08 లక్షలుగా లెకించారు. ఎ లక్ట్రానిక్ పరికరాల విలువ రూ.7,01,171గా గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నగదు నిల్వలు ఉన్నట్టు వెల్లడించారు. యాదగిరిరావును హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

