సెలవుల క్రమబద్ధీకరణ కోసం రూ. 2లక్షల డిమాండ్..ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ
నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీఈ మురళీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం .. లైన్మెన్గా పనిచేస్తున్న గుంటూరు శ్రీనివాస్ తన సెలవుల క్రమబద్ధీకరణ చేయాలని డీఈ మురళీధర్ రెడ్డిని కోరారు.
అందుకు గాను డీఈ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పినా డీఈ ససేమిరా అన్నారు. విసిగిపోయిన లైన్ మెన్ శ్రీనివాస్ నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం రూ.2 లక్షలు తీసుకుంటుండగా డీఈ మురళీధర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అదేవిధంగా డీఈ మురళీధర్‌కు చెందిన హైదరాబాద్‌లో ఒక ఇల్లు, నల్లగొండలో రెండు ఇండ్లపై దాడులు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 40 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

