హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9 వరకు తెలంగాణవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఏసీబీ కా ర్యాలయంలో ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్, బ్రోచర్లను విజయ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఈ పోస్టర్లను ఆవిష్కరించినట్టు తెలిపారు.