హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీహబ్ నిర్మాణ శైలి అద్భుతంగా ఉన్నదని హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (హెచ్ఎస్ఐఐసీ)కు చెం దిన ఉన్నతాధికారుల బృందం ప్రశంసించిం ది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై అధ్యయనం చేసేందుకు ఆ బృం దం మంగళవారం హైదరాబాద్‌కు విచ్చేసిం ది. నగరంలోని టీహబ్‌తోపాటు దండుమలాపూర్ ఎంఎస్ఎంఈ పారు, రావిర్యాల ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్టరింగ్ క్లస్టర్ తదితర ప్రాంతాలను సందర్శించింది. హెచ్ఎస్ఐఐసీ ఈడీ సందీప్ చావ్లా, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్టరింగ్ అండ్ లీగల్ సెల్ నోడల్ ఆఫీసర్ రాజీవ్‌శర్మ, ఇంజినీరింగ్ విభాగ అధిపతి అర్జున్ పాండే, రిలేషన్షిప్ వింగ్ మేనేజర్ హితేశ్శర్మ, కన్సల్టెంట్ ప్రీతమ్ దేశ్‌ముఖ్ తదితరులతో కూడిన ఈ బృందం తొలుత టీఎస్ఐఐసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణలో నూతన పారిశ్రామికవాడల అభివృద్ధి, టీహబ్ నిర్మాణం, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్ఏ) విధివిధానాల గురించి వారు తెలుసుకొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి గురించి హర్యా నా అధికారులకు వివరించారు. సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమ ల్లు, వైస్‌చైర్మన్, ఎండీ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మరో 14 పారిశ్రామికవాడలను నిర్మిస్తున్నామని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి హర్యానా అధికారులకు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం లో 1.45 లక్షల ఎకరాల భూములను గుర్తించామని, వీటిని భారీ పరిశ్రమలకు కేటాయించనున్నామని వివరించారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం అన్ని జిల్లాల్లో కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమి స్తున్నారని, స్వీయ ధ్రువీకరణతో పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను 15 రోజుల్లోనే ఇచ్చేలా ‘టీఎస్ ఐపాస్’ పేరుతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టారని వివరించారు.