అనాథలకు అండ
- అనాథ శరణాలయాల సమస్యలపై అధ్యయనం
- మంత్రి సత్యవతి నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీ
- కరోనా వల్ల అనాథలైన పిల్లలకు సర్కారు అండ
- అనాథల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి
- క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
- కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కరోనా వల్ల తల్లదండ్రులు చనిపోయి, అనాథలైన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మొదట ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అనాథ పిల్లల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని క్యాబినెట్ ఆదేశించింది. ‘తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎదిగే వయస్సులో ఉన్న పిల్లలు ఒంటరిగా మారి మానసిక వేదనతోపాటు సామాజిక వివక్షను ఎదురొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదమున్నది. వాళ్ల కాళ్ల్ల మీద వాళ్లు నిలబడి ప్రయోజకులయ్యేంత వరకు ప్రభుత్వమే వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలవాలి. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతోపాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. అనాథ పిల్లలకోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వయంత్రాంగం స్పందించాలి. అనాథ పిల్లల అంశానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
క్యాబినెట్ సబ్‌కమిటీ
అనాథపిల్లల సంరక్షణ, అనాథ శరణాలయాల సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీని క్యాబినెట్ ఏర్పాటుచేసింది. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, కే తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులుగా ఉంటారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఆహ్వానితులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కరోనా నియంత్రణకు ముందస్తు చర్యలు
కరోనా వైరస్ మళ్లీ విజృంభించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను క్యాబినెట్ ఆదేశించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్, మందులు, బెడ్స్ లభ్యతపై ఆరా తీసింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు సూచించింది. కేసులు ఎకువగా నమోదవున్న ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

