రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికురాలి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్‌కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్లో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 7: రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్‌కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్లో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది.
దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం బషీర్‌బాగ్ నుంచి లిబర్టీకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు టస్కర్ చక్రాల కింద పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక దవాఖానకు తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టస్కర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై మేయర్, కమిషనర్ ఆరా
కాగా, జీహెచ్ఎంసీ కార్మికురాలు రేణుక మృతిపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్నణ్ ఆరా తీశారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రేణుక కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

